భోపాల్ గ్యాస్ విషాదానికి 36 ఏండ్లు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఎరువుల కర్మాగారం నుంచి విషవాయువులు వెలువడి వేలాది మంది మరణించిన విషాద ఘటన జరిగి బుధవారం నాటికి 36 ఏండ్లు అయ్యింది. 1984 డిసెంబర్ 2 రాత్రి నుంచి 3 వ తేదీ వరకు వెలువడిన విష వాయువు వల్ల 16 వేల మందికిపైగా మరణించినట్లు ఆరోపణలుండగా 3,787 మంది చనిపోయినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. కాగా 5.5 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్త పరిశ్రమల ప్రమాదాల్లో ఘోరమైనదిగా పేర్కొనే ఈ దుర్ఘటన జరిగి 36 ఏండ్లయ్యింది. ఈ నేపథ్యంలో భోపాల్ ప్రజలు బుధవారం సాయంత్రం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికాకు చెందిన రసాయన పరిశ్రమకుగాక భోపాల్ ప్రజలకు ప్రధాని మోదీ అండగా నిలువాలంటూ నినాదాలు చేశారు. విషవాయువు కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో చాలా ఏండ్లుగా లక్షలాది మంది బాధపడుతున్నారని వాపోయారు. కరోనా కంటే కూడా వెంటాడుతున్న ఈ అనారోగ్య సమస్యలే ప్రాణాంతకంగా మారాయని ఆవేదన చెందారు.
తాజావార్తలు
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్‌కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
- రూ. పది కోట్లకు హ్యాకర్ల స్కెచ్
- ఆ మ్యాచ్ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!
- రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
- సూరత్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి
- చైనాకు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ వార్నింగ్
- చిరుతను చంపి తిన్నారు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు
- నిలకడగా శశికళ ఆరోగ్యం