శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 11:35:56

మిడతల సమస్యకు.. నూతన పరిష్కారం!

మిడతల సమస్యకు.. నూతన పరిష్కారం!

కరోనా సమస్య నుంచి కోలుకోకుండానే మిడతల దండు సమస్య మొదలైంది. వీటిని తరిమికొట్టేందుకు రైతులు చేయని ప్రయత్నాలు లేవు. ఇటీవల పొలంలో డీజే సెటప్‌, పెద్ద సౌండ్స్‌తో పాటలు ప్లే చేసిన ఐడియా నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

అయితే.. సమస్యకు తగినట్లుగానే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి అంటున్నారు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ పర్వీన్‌ కెశ్వన్‌. మిడతల దాడికి ఎక్కువగా నష్టపోయేది రైతులే. అందుకే దీనికి పరిష్కారం కూడా వీరే కనుగొన్నారు. పెద్ద శబ్దాలు చేస్తే మిడతలు పారిపోతాయి. అందుకని ఒక ఆవిష్కరణకు పూనుకున్నారు. ‘నిలువుగా ఒక కర్రను బిగించి దానికి ఒక వైపు ఫ్యాన్‌ మరోవైపు చిన్న డ్రమ్‌ మధ్యలో ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ డ్రమ్‌కు వెనుకవైపు అట్టముక్కను కూడా అంటించారు. గాలికి ఫ్యాన్‌ తిరగడంతో డ్రమ్‌ ప్లే అవుతుంది. దీంతో టిక్‌.. టిక్‌.. అనే శబ్దం వస్తుంది’. ఈ శబ్దానికి మిడతలు పరార్‌ అవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను పర్వీన్‌ కెశ్వన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఆధునిక సమస్యకు ఆధునిక పరిష్కారం’. మిడతల కోసం స్థానిక ఆవిష్కరణ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఈ ఐడియాను అభినందించేందుకు నెటిజన్లు కామెంట్లు చేయడానికి ముందుకు వస్తున్నారు. 


logo