గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 09:05:30

అసోంలో ప్రవేశించే ప్రతీఒక్కరికి స్టాంప్‌

అసోంలో ప్రవేశించే ప్రతీఒక్కరికి స్టాంప్‌

గౌహతి : ఇతర రాష్రాల నుంచి అసోం రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతీఒక్కరికి స్టాంప్‌ వేసి 14 రోజుల పాటు క్వారంటైన్‌ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నిరోధానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. క్వారంటైన్‌ గడువు ముగియకముందే బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో కనిపిస్తే వారిని పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రజలు మరో రెండు వారాల పాటు ఇండ్లలోనే ఉండాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పనంద సోనోవాల్‌ విజ్ఞప్తి చేశారు. బస్సులు, టెంపోలు సహా అన్ని ప్రజా రవాణా, వాణిజ్య వాహన సర్వీసులు రేపటి వరకు బంద్‌ పాటిస్తున్నాయి.  

అసోంతో పాటు ఇతర ఈశాన్య రాష్ర్టాల్లో ఇప్పటి వరకు కరోనా కేసు నమోదు కాని విషయం తెలిసిందే. కరోనాపై భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 390 నమోదు కాగా ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందారు. రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులను మార్చి 31 వరకు నిషేధించారు. 


logo