బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 06:56:33

అనుమ‌తి లేద‌న్నా గుడికి 15 మంది వ‌చ్చారు..

అనుమ‌తి లేద‌న్నా గుడికి 15 మంది వ‌చ్చారు..

ఇండోర్ :   మ‌‌ధ్య‌ప్ర‌దేశ్ లో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్ లోని నార్సింగ్ ఆల‌యం ద‌గ్గ‌ర పూజ‌ల పేరుతో 15 మంది గుమిగూడారు. గుడిలో పూజ‌ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ 15 మంది నాకు ఓ లేఖ ఇచ్చారు. అయితే లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో గుడి ద‌గ్గ‌ర పూజ‌లు చేయ‌డానికి వీలు లేద‌ని వారికి చెప్పి పంపించాం.

పోలీసుల సూచ‌న‌లు లెక్క‌చేయ‌కుండా వారంతా మ‌ళ్లీ గుడి ద‌గ్గ‌రకు వ‌చ్చారు. అంద‌రికీ అదుపులోకి తీసుకున్నామ‌ని స‌రాఫా పోలీస్ స్టేష‌న్ ఇంఛార్జి తెలిపారు.  క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌జ‌లంతా ఇండ్ల‌లో ఉండి స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo