గురువారం 09 జూలై 2020
National - Jul 01, 2020 , 08:16:25

గిన్నెలు కొట్టి మిడ‌త‌ల త‌రుముతున్న రైతులు.. వీడియో

గిన్నెలు కొట్టి మిడ‌త‌ల త‌రుముతున్న రైతులు.. వీడియో

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో మిడ‌త‌ల బెడ‌ద పెరుగుతున్న‌ది. సౌదీ ఆరేబియా నుంచి పాకిస్థాన్ మీదుగా దేశంలోకి ప్ర‌వేశించిన ఎడారి మిడ‌త‌లు రాజ‌స్థాన్‌లోని ప‌లు జిల్లాల్లో పంట‌ల‌పై దాడి చేస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై డ్రోన్ల సాయంతో క్రిమిసంహార‌కాలను చ‌ల్లి మిడ‌త‌ల స‌మూహాల‌ను సంహ‌రిస్తున్న‌ది. అయినా కొత్త స‌మూహాలు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా రాజ‌స్థాన్‌లోని నౌగౌర్ జిల్లాలో పంట పొలాల‌పై మిడ‌త‌లు దాడిచేశాయి. 

దీంతో స్థానికులు వంట గిన్నెలు, అన్నం తినే త‌ల్లెలను క‌ర్ర‌ల‌తో కొడుతూ మిడ‌త‌ల‌ను త‌రుముతున్నారు.  రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్ జిల్లాలోనూ మిడ‌త‌లు ప్ర‌వేశించ‌గా అధికారులు డ్రోన్ల సాయంతో కెమిక‌ల్స్ పిచికారీ చేస్తున్నారు. నౌగౌర్ జిల్లాలోని దిద్వానా గ్రామంలో స్థానికులు త‌మ పంట పొలాల నుంచి మిడ‌త‌ల‌ను త‌రుముతున్న దృశ్యాల‌ను కింది వీడియోలో చూడొచ్చు. కాగా, ఎడారి మిడ‌త‌ల‌కు ఇది పున‌రుత్ప‌త్తి స‌మ‌య‌మ‌ని, అందువ‌ల్ల మిడ‌త‌ల గుంపులు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు చెప్పారు. 


logo