గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 06:39:13

కేసుల ఆన్‌లైన్‌ విచారణను ప్రజలు చూడొచ్చు: ఢిల్లీ హైకోర్టు

కేసుల ఆన్‌లైన్‌ విచారణను ప్రజలు చూడొచ్చు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా నిర్వహిస్తున్న కేసుల విచారణను ఆసక్తిగల ప్రజలు వీక్షించవచ్చునని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ మనోజ్‌ జైన్‌ శనివారం సర్క్యులర్‌ జారీచేశారు.

తమకు అందుబాటులో ఉన్న సమయం మేరకు, వ్యవస్థకు అంతరాయం కలుగనంత వరకు విచారణను ప్రజలు వీక్షించడానికి అనుమతి ఇస్తామని అందులో పేర్కొన్నారు. ‘రహస్య విచారణ జరుపుతున్న కేసులు మినహా ఓపెన్‌ కోర్టు ప్రొసీడింగ్స్‌ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇతర కేసుల విచారణ ప్రక్రియను వీక్షించవచ్చు ’ అని తెలిపారు.


logo