ఆదివారం 07 జూన్ 2020
National - Apr 03, 2020 , 14:52:42

పోలీసులపై దాడులు చేస్తే ఎన్‌ఎస్‌ఏ కేసులు

పోలీసులపై దాడులు చేస్తే ఎన్‌ఎస్‌ఏ కేసులు

లక్నో: పోలీసులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో పోలీసులు అనునిత్యం విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వివిధ కారణాలతో రోడ్లపైకి వస్తున్న ప్రజలను వారు అడ్డుకుంటున్నారు. దీంతో వారిపై ప్రజలు తిరుగబడుతున్నారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈమేరకునిర్ణయం తీసుకున్నది. వైద్యసిబ్బందిపై తరచూ దాడులు జరుగుతుండటంతో మధ్యప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. దేశంలో ఇప్పటివరకు 2300లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా జనాభా ఈ మహమ్మారి బారినపడగా, 50వేల మందికిపైగా మరణించారు. 


logo