గురువారం 04 జూన్ 2020
National - May 07, 2020 , 07:40:16

'ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు..ఇక్క‌డికి రారు'

'ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు..ఇక్క‌డికి రారు'

ధ‌ర‌మ్ శాలా: లాక్ డౌన్ ప‌ర్యాట‌క శాఖ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. క‌రోనా వైర‌స్ ను త‌రిమికొట్టిన త‌ర్వాత కూడా ప‌ర్యాట‌కులు చాలా రోజుల వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు రార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర‌మ్ శాలాలో హోట‌ల్ య‌జ‌మాని విజ‌యేంద‌ర్ మాట్లాడుతూ..ఏడాది కాలంలో వ‌చ్చే రెవెన్యూ ఆదాయంలో ఏప్రిల్‌, మే, జూన్ లో 50-60 శాతం ప‌ర్యాటకం ద్వారా వ‌స్తుంది. క‌రోనా ప్ర‌భావంతో ఆదాయం పూర్తిగా కోల్పోయాం. క‌రోనా ధాటికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. క‌రోనా పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన తర్వాత కూడా సంద‌ర్శ‌కులు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రుణాల‌పై ప్ర‌భుత్వం కేవ‌లం 3 నెల‌ల వ‌ర‌కే వ‌డ్డీ చెల్లింపుల‌ను వాయిదా వేసింది. క‌నీసం ఏడాది వ‌ర‌కు ఈ కాల‌ప‌రిమితి ఉండాలి. అంతేకాకుండా టూరిజం ఇండ‌స్ట్రీ కోసం ప్ర‌భుత్వం ప్యాకేజీని ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo