ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 14:09:21

బిహార్‌లో వ‌ర‌ద‌లు.. 38లక్షల మందిపై ప్ర‌భావం

బిహార్‌లో వ‌ర‌ద‌లు.. 38లక్షల మందిపై ప్ర‌భావం

పాట్నా : ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో బిహార్ అత‌లాకుత‌లం అవుతోంది. రాష్ర్టంలో 38,47,531 మందిపై వ‌ర‌ద ప్ర‌భావం ప‌డింది. తాత్కాలిక ఆశ్ర‌యాల్లో 25,116 మంది త‌ల‌దాచుకున్న‌ట్లు బిహార్ ప్రభుత్వం తెలిపింది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అదేవిధంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 26 బృందాలు ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 

వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ముజఫర్‌పూర్ జిల్లాలో 8,77,138 మంది, సుపాల్‌లో 81,198 మంది ప్రభావితమయ్యారు. ఈ ప్రాంతాల్లో నిరంత‌రాయంగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల గండ‌కి, బాగ్మ‌తి న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తూ ప‌లు నివాస ప్రాంతాల్లోకి ప్ర‌వేశించ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. లోత‌ట్టు ప్రాంతాల‌న్ని జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఇళ్లు మునిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఎత్తైన ప్ర‌దేశాల‌కు మారారు. క‌నీస జీవ‌నానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 


logo