శుక్రవారం 05 జూన్ 2020
National - May 21, 2020 , 02:31:26

సొంత స్కూల్‌లోనే పరీక్షలు

సొంత స్కూల్‌లోనే పరీక్షలు

  • సీబీఎస్‌ఈ పెండింగ్‌ ఎగ్జామ్స్‌పై కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పెండింగ్‌ పరీక్షలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనురుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. జూలై నెలాఖరుకు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.  

సైబర్‌ సేఫ్టీపై మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులు సాధారణ తరగతి బోధన నుంచి డిజిటల్‌ విధానాలకు మళ్లిన నేపథ్యంలో సైబర్‌ సేఫ్టీ మార్గదర్శకాలను సీబీఎస్‌ఈ జారీ చేసింది. డిజిటల్‌ హక్కులు, బాధ్యతలతోపాటు సైబర్‌ మోసాల గురించి వివరించే హ్యాండ్‌ బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్‌ బెదిరింపులు, ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు, సైబర్‌ తీవ్రవాదం, ఆన్‌లైన్‌ మోసాలు, ప్రలోభాలు వంటి వాటిని క్షుణ్ణంగా వివరించింది. 


logo