మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 12:15:20

రైల్వే బోర్డు ఛైర్మ‌న్‌ను క‌లిసిన పెద్ద‌ప‌ల్లి ఎంపీ

రైల్వే బోర్డు ఛైర్మ‌న్‌ను క‌లిసిన పెద్ద‌ప‌ల్లి ఎంపీ

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రైల్వే బోర్డు ప్ర‌ధాన కార్యాల‌యంలో ఛైర్మ‌న్ వినోద్ కుమార్ యాద‌వ్‌ను పెద్ద‌ప‌ల్లి టీఆర్ఎస్ ఎంపీ బోర్ల‌కుంట వెంక‌టేశ్ నేత శుక్ర‌వారం ఉద‌యం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంచిర్యాల అండ‌ర్ బ్రిడ్జి, రేచిని ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌ను త‌ర్వ‌గా ప్రారంభించాల‌ని రైల్వే బోర్డు ఛైర్మ‌న్‌కు ఎంపీ విజ్ఞ‌ప్తి చేశారు. పెద్ద‌ప‌ల్లి, మంథ‌ని, రామ‌గుండం నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ బ్రిడ్జిలు, ఫ్లాట్ ఫామ్‌ల‌కు సంబంధించిన పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ వెంక‌టేశ్ నేత కోరారు.