శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 18:03:00

సామాజిక దూరం అంటే ఇలా..నెమ‌ళ్ల ఫొటో వైర‌ల్

సామాజిక దూరం అంటే ఇలా..నెమ‌ళ్ల ఫొటో వైర‌ల్

రాజ‌స్థాన్ : క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌భుత్వాలు సూచ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వ్య‌క్తికి వ్య‌క్తికీ మ‌ధ్య సామాజిక దూరం (సోష‌ల్ డిస్టేన్స్) పాటిస్తే క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చ‌ని డాక్ల‌రు, నిపుణులు చెప్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను మ‌న జాతీయ ప‌క్షులు నెమ‌ళ్లు కూడా తీక్ష‌ణంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఉన్నాయి.

సామాజిక దూరం పాటించ‌డం అంటే ఇట్లా...అంటూ చెప్తున్న‌ట్లుగా ఉన్న ఓ ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. రాజ‌స్థాన్ లోని నగౌర్ ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల వ‌రండాలో నెమ‌ళ్లు ఒక‌దానికొక‌టి దూరం పాటిస్తూ...క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌డుకున్న ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ షేర్ చేశారు. 
logo