శనివారం 06 జూన్ 2020
National - May 11, 2020 , 15:37:17

ఇలాంటి అనుకోని అతిథి వస్తే.. మీరైతే ఏంచేస్తారు

ఇలాంటి అనుకోని అతిథి వస్తే.. మీరైతే ఏంచేస్తారు

న్యూఢిల్లీ: మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారి కోసం ఏచేయాలో మనకు ఒక్కోసారి తోచదు. అలాంటిది అనుకోని అతిథి వచ్చేందే అనుకోండి.. మరీ గాబరాపడిపోయి ఏంచేయాలో పాలుపోక.. ఏమీ చేయక మిన్నకుండిపోతాం. అలాంటి పరిస్థితే గుంజన్‌ మెహతాకు అనుభవపూర్వకంగా ఎదురైంది. తన ఇంటికి వయ్యారాలు ఒలకబోస్తూ తన అందమైన తోకను ఊపుతూ వచ్చిన అనుకోని అతిథి నెమలిని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌చేసింది. ఇలాంటి అతిథి వస్తే.. మీరైతే ఏంచేస్తారు? అంటూ ట్యాగ్‌ చేసింది. దానికి నెటిజెన్లు తమకు తోచిన కామెంట్లు జోడించారు. నేనైతే ఛాయ్‌ ఆఫర్‌ చేసి ముచ్చట్లు పెడుతూ గడుపుతాను అని అటవీశాఖ అధికారి ప్రవీణ్‌ కేశ్వాన్‌ తన కామెంట్‌ పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే రెండు వేల లైక్లు రాగా 300 మంది రీట్వీట్‌ చేశారు.


logo