శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 18:17:10

రోడ్డుపై నెమళ్ల నాట్యం.. అందుకేనా!

రోడ్డుపై నెమళ్ల నాట్యం.. అందుకేనా!

లాక్‌డౌన్‌లో మనుషులకు ఉపయోగం ఉన్నదో లేదో తెలియదు కాని వన్యప్రాణులకు మాత్రం బాగా కలిసోచ్చింది. వాతావరణ కాలుష్యానికి పక్షి జాతి అంతరించి పోయే అవకాశం ఎక్కువగా ఉన్న రోజుల్లో కరోనా దాపరించింది. ఇది మనుషులు హానిగా మారినా వన్యప్రాణులకు ఉపయోగపడింది. దీంతో వాతావరణం కాస్త కుదుటపడింది. కాలుష్యం తగ్గింది. వర్షాలు మొదలయ్యాయి. దీంతో మూగజీవాలు, వన్యప్రాణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోవడంతో పదుల సంఖ్యలో నెమళ్లు రోడ్లపైకి వచ్చి మీటింగ్‌ పెట్టాయి. ఆడ, మగ నెమళ్లు ఒకచోట చేరి సందడి చేశాయి. ఇక మగనెమళ్లయితే ఆడ నెమళ్లని ఇంప్రెస్‌ చేసే పనిలో పడ్డాయి. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


logo