మంగళవారం 31 మార్చి 2020
National - Mar 04, 2020 , 01:25:49

దేశాభివృద్ధికి శాంతి, సామరస్యం తప్పనిసరి

దేశాభివృద్ధికి శాంతి, సామరస్యం తప్పనిసరి

న్యూఢిల్లీ, మార్చి 3: దేశాభివృద్ధి జరుగాలంటే శాంతి, సామరస్యం, ఐక్యత తప్పనిసరని, సమాజంలో స్నేహపూర్వక వాతావరణం కోసం పార్టీ నేతలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ఇటీవల చెలరేగిన మతఘర్షణలపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్లమెంటు సమావేశాలకు ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఎంపీలకు ఈ సందర్భంగా మోదీ దిశానిర్దేశం చేస్తూ.. సమాజంలో శాంతి పునరుద్ధరణకు, స్నేహపూర్వక వాతావరణం నెలకొనేందుకు పాటుపడాలని కోరారు. ఈ క్రమంలో.. ‘భారత్‌ మాతా కీ జై’ అన్న నినాదం ఇటీవలి కాలంలో దుర్వనియోగం అవుతుందని ఆరోపించిన మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ‘భారత్‌ మాతా కీ జై’ వంటి నినాదాల్ని కూడా అనుమానంగా చూస్తూ.. దాంట్లోనూ దుర్వాసనను వెతుకుతున్నారని ధ్వజమెత్తారు. 


logo
>>>>>>