మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 19:24:55

కంటైన్మెంట్ జోన్ల‌లో ఇంటి వ‌ద్ద‌కే రేష‌న్‌

కంటైన్మెంట్ జోన్ల‌లో ఇంటి వ‌ద్ద‌కే రేష‌న్‌

బెంగ‌ళూరు : బెంగ‌ళూరులో కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో జ‌న స‌మ‌ర్థ‌త‌ను నివారించేందుకు కంటైన్‌మెంట్ జోన్ల‌లోని రేష‌న్ కార్డుదారుల‌కు ఇంటి వద్దే ఆహార ధాన్యాల‌ను అందించ‌నున్న‌ట్లు అధికారులు బుధ‌వారం తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలు, వాహనాల కదలికల‌పై పరిమితులు విధించ‌డం వ‌ల్ల రేషన్ కార్డుదారులంద‌రికీ వారి ఇళ్ల వ‌ద్దే ఆహార ధాన్యాలు, వ‌స్తు సామగ్రి పంపిణీ చేయబడుతుంద‌ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరా విభాగం అధికారి చెప్పారు. న‌గ‌ర‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తేసిన‌ప్ప‌టికీ కంటైన్మెంట్ జోన్ల‌లోని ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. 

నగరవ్యాప్తంగా 1,423 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్ల‌లో పశ్చిమ శివారు ప్రాంతాల్లో 791, తూర్పున 242, ఈశాన్యంలో 124, దక్షిణాన 118 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణాల నుండి నెలవారీ కోటా ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడానికి నగరంలో సుమారు 10 లక్షల బిపిఎల్ రేషన్ కార్డులు, 5 లక్షల ఎపిఎల్ కార్డులు, 2 లక్షల అంత్యోద‌య కార్డులు ఉన్న‌ట్లు స‌ద‌రు అధికారి తెలిపారు. ఎటువంటి రేష‌న్ కార్డు లేనివారు త‌మ స‌మీపంలోని రేష‌న్ దుకాణాల్లో పేర్లు న‌మోదు చేసుకుంటే వారికి కూడా రేష‌న్ స‌రుకుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.


logo