మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 26, 2020 , 17:25:34

పీడీపీకి ముగ్గురు నేతలు రాజీనామా

పీడీపీకి ముగ్గురు నేతలు రాజీనామా

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. టిఎస్ బజ్వా, వేద్ మహాజన్, హుస్సేన్ ఎ వాఫా సోమవారం రాజీనామా లేఖలు రాశారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి పంపారు. ఆమె చేసిన కొన్ని చర్యలు, ప్రత్యేకంగా దేశభక్తి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం తమకు చాలా అసౌకర్యంగా అనిపిస్తున్నదని  తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు. సుమారు ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉంచిన మెహబూబా ముఫ్తీని ఇటీవల విడుదల చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించే వరకు, రాష్ట్ర ఏకీకరణ జరిగేంత వరకు, పాత జమ్ముకశ్మీర్‌ జెండా ఎగిరే వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోమని ఇటీవల ఆమె అన్నారు. మెహబూబా ముఫ్తీ చేసిన ఈ వ్యాఖ్యలపై పీడీపీ నేతలు టిఎస్ బజ్వా, వేద్ మహాజన్, హుస్సేన్ ఎ వాఫా అసంతృప్తి వ్యక్తం చేశారు. పీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ముగ్గురు నేతలు తమ రాజీనామా లేఖలను మెహబూబా ముఫ్తీకి పంపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.