శనివారం 28 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 16:51:51

భారతీయులు కశ్మీర్‌లో స్థిరపడితే లైంగిక వేధిపులు పెరుగుతాయి : పీడీపీ నేత

భారతీయులు కశ్మీర్‌లో స్థిరపడితే లైంగిక వేధిపులు పెరుగుతాయి : పీడీపీ నేత

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకుడు సురీందర్‌ చౌదరి దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు ఇక జమ్ముకశ్మీర్‌లో భూములు కొని స్థిరపడితే.. ఇక్కడ లైంగిక వేధింపులు తీవ్రమవుతాయని పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ సన్నిహితుడు వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలోని భూములను ఎవరైనా కొనుగోలు చేయవచ్చునని మంగళవారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన నేపథ్యంలో సురీందర్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

భూ చట్టాలలో మార్పులు వచ్చిన తరువాత దేశంలోని ఇతర ప్రాంతాల భారతీయులు ఇక్కడ స్థిరపడటానికి వస్తే జమ్ముకశ్మీర్‌లో లైంగికదాడులు పెరుగుతాయని ఆయన చెప్పారు. జమ్ముకు గొప్ప డోగ్రా సంస్కృతి, వారసత్వం ఉన్నదని, తాము దేశం కోసం అనేక త్యాగాలు చేశామన్నారు. ప్రజలు బయటి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడి యువతకు రావాల్సిన ఉద్యోగాలను కొల్లగొడతారని చౌదరి అన్నారు. ఇవ్వాల జమ్ము ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉన్నదని, జమ్ములో చదువుకోవడానికి మహిళలు వివిధ గ్రామాల నుంచి వస్తున్నారని చెప్పారు. నిన్న ఫరీదాబాద్‌లో.. అంతకు ముందు హత్రాస్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందేనని తెలిపారు. 

భూ యాజమాన్యంతో సహా అనేక చట్టాలను సవరించడానికి మంగళవారం కేంద్రం తీసుకున్న చర్య కేంద్ర భూభాగంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ లను రద్దు చేయడానికి ముందు జమ్ముకశ్మీర్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అనుమతి లేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.