సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 12:12:42

2 లక్షలు ఇవ్వకపోతే స్కూల్‌ను పేల్చేస్తా.. విద్యార్థి బెదిరింపు

2 లక్షలు ఇవ్వకపోతే స్కూల్‌ను పేల్చేస్తా.. విద్యార్థి బెదిరింపు

లక్నో : ఓ విద్యార్థి తాను చదువుకుంటున్న స్కూల్‌నే పేల్చేస్తానని బెదిరింపు లేఖ పంపాడు. స్కూల్లో బాంబులు అమర్చానని.. రూ. 2 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆ బాంబులను పేల్చేస్తానని బెదిరించాడు విద్యార్థి. ఈ ఘటన బరేలిలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది.

స్కూల్‌ మేనేజర్‌ అనిల్‌ సింగ్‌ కథనం ప్రకారం.. తమ పాఠశాలకు ఆదివారం ఓ లేఖ వచ్చింది. రూ. 2 లక్షలు ఇవ్వకపోతే పుల్వామా ఉగ్రదాడి తరహాలో మీ పాఠశాలను పేల్చేస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే స్కూల్లో బాంబులు పెట్టానని లేఖలో తెలిపారు. దీంతో తాము అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాం. డాగ్‌ స్కాడ్‌ బృందం తనిఖీలు జరిపి పాఠశాలలో ఎలాంటి బాంబులు అమర్చలేదని స్పష్టం చేశారు. మళ్లీ మంగళవారం మరో లేఖ వచ్చింది. రూ. 2 లక్షలు ఇవ్వాలని లేఖలో డిమాండ్‌ చేశారు. చేసేదేమీ లేక స్కూల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

లేఖకు ఉపయోగించిన పేపరే.. నిందితుడిని పట్టించింది

అయితే ఆ లేఖకు ఉపయోగించిన పేపర్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఆ పేపర్‌ అదే స్కూల్‌కు చెందిన సైన్స్‌ నోట్‌బుక్‌లోనిదిగా గుర్తించారు. అది కూడా 9, 10 తరగతి విద్యార్థుల నోట్‌బుక్స్‌లోని పేపర్‌. ఈ పేపర్‌ ఆధారంగా లేఖ రాసిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ లేఖ రాయడంలో అతని ప్రమేయం లేదని, మరో వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. 


logo