సోమవారం 25 మే 2020
National - Mar 31, 2020 , 19:14:42

క్వారంటైన్ కేంద్రాలుగా స్టార్ హోటళ్లు

క్వారంటైన్ కేంద్రాలుగా స్టార్ హోటళ్లు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్టార్ హోటళ్లనూ అదనంగా సెల్ఫ్ ఐసోలేషన్ సౌకర్యాలతో క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు ఒడిశా సర్కారు సిద్దమైంది. అందుకోసం భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న 12 హోటళ్లలో క్వారయింటైన్‌కు అవసరమయ్యే ఏర్పాట్లు చేసింది. ముందుజాగ్రత్తగా 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునే వారు డబ్బులు చెల్లించి  ప్రైవేటు హోటళ్లలోనూ ఉండొచ్చని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారు ఇండ్లలో కాకుండా ఈ హోటళ్లలోనే ఉండడం వల్ల మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. హోటళ్లలో రోజుకు రూ.2,500 ల చొప్పున చెల్లిస్తే క్వారంటైన్‌ గదిలో వసతితోపాటు బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్, రెండు వాటర్ బాటిళ్లను అందించనున్నట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. 

ఇతర దేశాల నుంచి 4,500మంది వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హోటళ్లలో క్వారంటైన్ సౌకర్యాలను వైద్యులు పర్యవేక్షించనున్నారు. కొన్ని హోటళ్లలో రోజుకు రూ.450 నుంచి రూ.2వేలు చెల్లిస్తే క్వారంటయిన్ కు అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నారు. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు50 హోటళ్లను క్వారంటయిన్ కేంద్రాలుగా మార్చారు.


logo