శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 18:24:29

ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చండి : పవన్‌ గుప్త

ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చండి : పవన్‌ గుప్త

న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార కేసులో దోషి పవన్‌ గుప్త సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమని పిటిషన్‌లో కోరాడు.  ట్రయల్‌ కోర్టు ఇచ్చిన డెత్‌వారెంట్‌పై స్టే విధించమని అతడి తరపు లాయరు పిటిషన్‌ దాఖలు చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ఒకరి పతరువాత ఒకరు ఏదో ఒక సాకుతో ఉరిశిక్ష అమలు కాకుండా కాలయాపన చేస్తున్న విషయంతెలిసిందే.  పవన్‌ గుప్త ఇప్పటి వరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోలేదు. రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ కూడా పెట్టుకోలేదు. ఈ కేసులో మిగతా ముగ్గురు (ముకేశ్‌ కుమార్‌, వినయ్‌ కుమార్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌) ఇప్పటికే రాష్ట్రపతికి క్షమాబిక్ష కోసం దరఖాస్తు పెట్టకున్నారు. అది తిరస్కరించడమూ జరిగింది. మార్చి ౩న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులనూ ఉరితీసేందుకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఐతే.. పవన్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయడంతో ఉరితీత మరోసారి ఆలస్యమయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది.


logo