శుక్రవారం 03 జూలై 2020
National - Jan 22, 2020 , 13:10:57

30న తీహార్‌ జైలుకు తలారి పవన్‌

30న తీహార్‌ జైలుకు తలారి పవన్‌

2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూకకు చావు తేదీ ఖరారైంది. నిర్భయపై అతి కిరాతకంగా లైంగికదాడి చేసి.. ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషుల్ని ఫిబ్రవరి 1న ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపత్యంలో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తలారి పవన్‌ జల్లాద్‌ను తీహార్‌ జైలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30వ తలారి పవన్‌ తీహార్‌ జైలుకు చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. నిర్భయ కేసులో అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ దోషులుగా ఉన్నారు. 


logo