ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 09:28:36

క‌రోనాతో ఫ్యామిలీ కోర్టు జ‌డ్జి మృతి

క‌రోనాతో ఫ్యామిలీ కోర్టు జ‌డ్జి మృతి

ప‌ట్నా: ‌బీహార్‌లో కరోనాతో మొద‌టిసారిగా ఓ జ‌డ్డి మ‌ర‌ణించారు. ప‌ట్నాకు చెందిన హ‌రిశ్చంద్ర శ్రీవాస్త‌వ (58) ఫ్యామిలీ కోర్టు జ‌డ్డిగా ప‌నిచేస్తున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అందులో ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది. దీంతో బుద‌వారం ఆయ‌న ప‌ట్నాలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో  శ్రీవాత్స‌వ ఈరోజు ఉద‌యం మ‌ర‌ణించార‌ని బీహార్ జుడీషియ‌ల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి అజిత్ కుమార్ సింగ్ వెల్ల‌డించారు. ‌శ్రీవాత్స‌వ మ‌ర‌ణించ‌డం బాధాక‌ర‌మ‌ని విచారం వ్య‌క్తం చేశారు.            


logo