బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 23:03:12

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా పట్లొల్ల మోహన్ రెడ్ది

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా పట్లొల్ల మోహన్ రెడ్ది

న్యూజర్సీ: అమెరికా న్యూజర్సీలో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం నూతన కార్యవర్గం కొలువుదీరింది. కామారెడ్ది జిల్లా, నెమిలి గ్రామానికి చెందిన  పట్లొల్ల డా.మోహన్ రెడ్ది నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.1983 లో అమెరికాకు ఉద్యొగరీత్యా ళ్లిన మోహన్ రెడ్ది, న్యూజర్సీ నగరం లో స్థిరపడి, ఐటీ , ఫార్మా రంగాల్లో తన ప్రతిభను చాటి, అక్కడి తెలంగాణ వాసుల అభివృద్ధికి ఎంతో  కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థుల చదువు, ఉద్యోగ కల్పనకు తనవంతుగా సాయం అందించారు. తన ఐటీ కంపెనీ ద్వారా ఇండియా అమెరికాల్లో ఉన్న నిరుద్యోగులకు ఫ్రీ జాబ్ ప్లెస్మెంట్ ట్రైనింగ్స్ ఇప్పించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

అమెరికాలో తన వంతు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ, ఉగాది పండగలను నిర్వహిస్తున్నారు. ఓ పక్క అమెరికాలో ఉన్న తెలుగు వారికి సహాయ పడుతూ తన సొంత ఊరు నెమిలి గ్రామంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు పట్లొల్ల మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం తరపున తెలంగాణ బిడ్డలకు నావంతుగా సాయం అందిస్తానని ' చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo