బుధవారం 03 జూన్ 2020
National - Apr 01, 2020 , 15:13:14

శానిటైజేషన్‌ వర్కర్లపై పూలవర్షం, కరెన్సీ నోట్ల దండలు.. వీడియో

శానిటైజేషన్‌ వర్కర్లపై పూలవర్షం, కరెన్సీ నోట్ల దండలు.. వీడియో

హైదరాబాద్‌ : శానిటైజేషన్‌ వర్కర్లు ముందు వరుసలో ఉండి కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో  శానిటైజేషన్‌ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి వీధిని పారిశుద్ధ్య కార్మికులు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూ ఈ వర్కర్లు విరామం లేకుండా కృషి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం.. ప్రాణాలను ఫణంగా పెట్టి వీధులను పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై ఎన్ని ప్రశంసలు కురిపించిన తక్కువే. 

పంజాబ్‌ పటియాలాలోని నభా వీధిలో శానిటైజేషన్‌ వర్కర్లకు ఊహించని గౌరవం లభించింది. నభాలో నివాసముంటున్న ప్రజలందరూ.. తమ అంతస్తుల పైనుంచి పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించారు. ఓ ముగ్గురు వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికుడి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. శానిటైజేషన్‌ వర్కర్ల కృషి అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

ఈ వీడియో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. పారిశుద్ధ్య కార్మికుడిపై నభా ప్రజలు చూపించిన ఆప్యాయత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న వారిలో ముందున్న పారిశుద్ధ్య కార్మికులను ఉత్సాహపరుద్దామని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo