గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 11:22:04

పతంజలి మందును నిలిపివేసిన కేంద్రం

పతంజలి మందును నిలిపివేసిన కేంద్రం

న్యూఢిల్లీ : యోగా గురువు రాందేవ్‌బాబా నేతృత్వంలో ‘కోరోనిల్‌’ పేరుతో పతంజలి సంస్థ కరోనా నివారణకు మందును విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మందును కేంద్రం నిలిపివేసింది. దీని గురించి ప్రచారం చేయడంపై కూడా నిషేధం విధించింది. ఈ మందుపై పరిశీలన చేసే వరకు ఎటువంటి ప్రచారం, ప్రకటన చేయరాదని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పతంజలి వారు చెబుతున్న అంశాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొంది.

'కోరోనిల్' మందును హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో కొందరు కోవిడ్-19 రోగులపై పరీక్షించామని పతంజలి సంస్థ ప్రకటించింది. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కేంద్రం పతంజలి సంస్థను ఆదేశించింది. ఇక ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అనుమతి లభించాకే ఈ మందును విక్రయించాల్సి ఉంటుంది.logo