గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 19:06:54

120 ఏళ్ల వృద్ధురాలికి ‘పతంజలి’ సాయం

 120 ఏళ్ల వృద్ధురాలికి ‘పతంజలి’ సాయం

ఒడిశా: ఒడిశా రాష్ట్రంలోని నౌపాడ పరిధి బారగన్‌ గ్రామంలోని 120 ఏళ్ల వృద్ధురాలి కుటుంబానికి పతంజలి సంస్థ చేయూతనందించింది.  బ్యాంక్‌ ఫిజికల్‌ స్టేట్‌మెంట్‌ కోసం శతాధిక వృద్ధురాలిని తన 70 ఏళ్ల కూతురు మంచంపై తీసుకెళ్తున్న వీడియె వైరల్‌ అయ్యింది. ఇది చూసి యోగా గురు రాందేవ్‌ బాబా చలించిపోయారు. వృద్ధురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని పతంజలి ఉద్యోగులను ఆదేశించారు. దీంతో భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ బృందం వారి గ్రామానికి చేరుకొని, పింఛన్‌ ప్రక్రియను పూర్తి చేయించింది. ఒక నెల పింఛన్‌ను కూడా ఇప్పించారు. అలాగే, రేషన్‌, నిత్యావసరాలతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే పతంజలి ఆయుర్వేద కిట్‌ను అందజేశారు. ఆ తల్లీకూతుళ్లతోపాటు గ్రామంలోని మహిళలకు కూడా చీరలు పంపిణీ చేశారు. 

 గుంజా డీ అనే 70 ఏళ్ల మహిళ శతాధిక వృద్ధురాలైన తన తల్లి పింఛన్‌ కోసం వెళ్లగా, బ్యాంకు అధికారులు ఫిజికల్‌ స్టేట్‌మెంట్‌ కోసం పట్టుబట్టారు. దీంతో చేసేదేమిలేక ఆమె తన తల్లిని మంచంపై లాక్కుంటూ బ్యాంకు వద్దకు తీసుకెళ్లింది. దీన్ని వీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యింది. అది చూసిన స్థానిక ఎమ్మెల్యే బ్యాంకు అధికారులది అమానవీయ చర్య అని మండిపడ్డారు. వారిపై చర్యలకు ఆదేశించారు.logo