బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 13:12:49

విమానంలో వ‌ర్షం.. గొడుగులు తెచ్చుకున్నారు కాబ‌ట్టి స‌రిపోయింది!

విమానంలో వ‌ర్షం.. గొడుగులు తెచ్చుకున్నారు కాబ‌ట్టి స‌రిపోయింది!

సైకిల్‌, బైక్ మీద వెళ్లేట‌ప్పుడు వ‌ర్షం ప‌డితే త‌డిసి ముద్ద ముద్ద‌వ్వ‌డం మాత్రం ప‌క్కా. అలా అవ్వ‌కుండా ఉండేందుకు కారు బెట‌ర్ అని కొంత ఖ‌ర్చు ఎక్కువైనా కారునే కొంటున్నారు. ఎక్కువ దూరం ప్ర‌యాణించ‌డానికి మాత్రం విమానం క‌న్నా సుర‌క్షిత‌మైన‌ది లేదు. పైగా హాయిగా వెళ్లిపోవ‌చ్చు. వ‌ర్షం ప‌డితుంద‌న్న భ‌యం కూడా అవ‌స‌రం లేదు. అలా అనుకునే ఈ ప్యాసింజ‌ర్లు త‌డిశారు. భారీ వ‌ర్షం వ‌ల‌న విమానంలోకి నీరు చేరి ప్ర‌యాణికుల‌ను త‌డిపేసింది. అదేంటి విమానంలోకి నీళ్లు రావ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా?

రోసియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం ఖబరోవ్స్క్ నుంచి సోచికి బయల్దేరింది. విమానం అలా గాల్లోకి ఎగిరిందో లేదో వ‌ర్షం దంచికొట్టింది. ఆ వ‌ర్ష‌పు నీరు కాస్త విమానం లోప‌లికి వ‌చ్చి ప్ర‌యాణికుల‌ను ఇబ్బంది పెట్టింది. కొంద‌రైతే ముందు జాగ్ర‌త్త‌గా గొడుగులు తెచ్చుకున్నారు. లేనివాళ్లు త‌డిసిపోయారు.  ఈ వ‌ర్షంలో త‌డుస్తూ కొంత‌మంది ప్ర‌యాణికులు తెగ ఎంజాయ్ చేశారు. కొంద‌రైతే వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో పెట్టారు. ఈ వీడియోల‌కు అనుకోని రేంజ్‌లో కామెంట్లు వ‌స్తున్నాయి. విమాన సిబ్బంది మాత్రం దీనిని ఖండిస్తూ ఏసీ లీకేజీ వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఏదైమైనా ఈ అద‌న‌పు సౌక‌ర్యం కోసం ఛార్జీలు అడ‌గ‌రు క‌దా అంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.logo