శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 04, 2020 , 19:23:25

భారత్‌, రష్యా నేవీ విన్యాసాలు షురూ

భారత్‌, రష్యా నేవీ విన్యాసాలు షురూ

న్యూఢిల్లీ: భారత్‌, రష్యా మధ్య సంయుక్త నేవీ విన్యాసాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరుగుతున్న పాసేజ్‌ ఎక్సర్‌సైజ్‌లో ఇండియన్‌ నేవీ, రష్యన్ ఫెడరేషన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. ఈ విన్యాసాలు శనివారం కూడా కొనసాగనున్నాయి. ఇరు దేశాల నావికా దళాల మధ్య అనుసంధానతను పెంచడం, అవగాహన మెరుగుపరుచుకోవడం, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం కోసం సంయుక్త నేవీ విన్యాసాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.