గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 14:47:02

సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ మూసివేత

సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ మూసివేత

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ కార్యాలయాన్ని మూసివేశారు. ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఒక ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కార్యాలయాన్ని మూసేసి.. ఫ్యుమిగేషన్‌, శానిటేషన్‌ చేశారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆర్మీ జవాన్‌కు మే 13న పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆర్మీ జవాన్‌ ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. కొవిడ్‌-19తో పోరాడేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 


logo