మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 13:02:54

పేక‌మేడ‌లా న‌దిలో కూలిన స్కూల్ బిల్డింగ్‌.. వీడియో

పేక‌మేడ‌లా న‌దిలో కూలిన స్కూల్ బిల్డింగ్‌.. వీడియో

ప‌ట్నా: బీహార్‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. వ‌ర‌ద‌నీరు బాగా నిలిచిపోవ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. రోడ్ల‌పై వ‌ర‌ద‌నీటి ప్ర‌వాహం న‌దుల‌ను త‌ల‌పిస్తున్న‌ది. దీంతో అధికారులు ఎప్పటిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. కాగా వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో రాష్ట్రంలోని న‌దుల‌న్నీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. 

భాగ‌ల్‌పూర్ జిల్లాలో కోషీ న‌ది ప్ర‌వాహం ఉధృతంగా ఉన్న‌ది. దీంతో నౌగ‌చ్చియా ఏరియాలో న‌దికి అనుకుని ఉన్న ఓ పాఠ‌శాల భ‌వ‌నం పేక  మేడ‌లా కుప్ప‌కూలింది. ఈ ఘట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వ‌చ్చు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo