శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 02, 2020 , 11:31:13

ఆపిల్ తింటున్న చిలుక‌.. ఎంతైనా అదృష్ట‌వంతురాలు!

ఆపిల్ తింటున్న చిలుక‌.. ఎంతైనా అదృష్ట‌వంతురాలు!

ప‌చ్చ‌ని చిలుక‌లు భ‌లే ముద్దుగా ఉంటాయి. అవి అరుస్తుంటే అలానే వినాల‌నిపిస్తుంది. వాటిని చేతుల మీద కూర్చోబెట్టుకొని ఆడుకోవాల‌నుకోని వారే ఉండ‌రు. చిలుక‌లంటే అంద‌రికీ అంత ఇష్టం. మ‌రి ఆ చిలుక మీకు న‌చ్చిన‌ట్లుగా చేతిమీద వాలి, మీరు పెట్టిన ఆహారం తింటే ఎలా ఫీల‌వుతారు? ఊహించుకోవ‌డానికే చాలా ఆనందంగా ఉంది క‌దా. ఈ విధంగా ఓ చిలుక ఒక మ‌హిళ చేతి మీద కూర్చొని  ఆపిల్ తింటున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

28 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో పార్కులో చిత్రీక‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది. "మీరు ఏదైనా ఉండగల ప్రపంచంలో, దయగా ఉండటానికి ఎంచుకోండిష‌ అనే శీర్షిక‌ను సుశాంత నందా జోడించారు. ఈ వీడియో చాలా బాగుందంటే నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.