బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 17:52:36

కోరం లేక ముగిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం

కోరం లేక ముగిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ :  విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం కోరం లేక ముగిసినట్లు తెలుస్తోంది. ‘నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ (ఎన్‌ఆర్‌ఐ) వివాహ నమోదు-2019 ముసాయిదా నివేదిక పరిగణన, స్వీకరణ’ అనే అజెండాపై ఇవాళ సమావేశం జరగాల్సి ఉంది. సమావేశానికి కమిటీ చైర్మన్‌ పీపీ చౌదరీతోపాటు ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో చైర్మన్‌ సమావేశాన్ని ముగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 31 మంది ఎంపీలుండగా వీరిలో 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు. సమావేశానికి హాజరైన కేజే అల్ఫోన్స్‌, సవప్‌దాస్‌ గుప్తా ఇద్దరు రాజ్యసభ సభ్యులే కావడం గమనార్హం. ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంపీలెవ్వరూ పార్లమెంట్‌ హౌజ్‌కు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని వినికిడి.
 
logo