శనివారం 28 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 14:48:55

చైనా పెట్టుబ‌డుల‌పై పేటీఎంను ప్ర‌శ్నించిన పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్‌

చైనా పెట్టుబ‌డుల‌పై పేటీఎంను ప్ర‌శ్నించిన పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్‌

హైద‌రాబాద్‌: చైనా పెట్టుబ‌డుల అంశంపై పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ ఇవాళ పేటీఎం సంస్థ‌ను ప్ర‌శ్నించింది. కంపెనీలో ఎంత మేర‌కు డ్రాగ‌న్ పెట్టుబ‌డులు ఉన్నాయ‌ని, క‌స్ట‌మ‌ర్ల డేటా ఉన్న స‌ర్వ‌ర్ల‌ను ఇండియాలోనే ఉంచాన్న అంశాన్ని పేటీఎం ప్ర‌తినిధుల‌తో ప్యాన‌ల్ స‌భ్యులు చ‌ర్చించారు.  వ్య‌క్తిగ‌త డేటా ర‌క్ష‌ణ బిల్లుకు చెందిన పార్ల‌మెంట‌రీ సంయుక్త క‌మిటీ ముందు పేటీఎం అధికారులు ఇవాళ హాజ‌ర‌య్యారు. సున్నిత‌మైన వ్య‌క్తిగ‌త డేటాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్యాన‌ల్‌కు పేటీఎం అధికారులు స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. పీటీఎం స‌ర్వ‌ర్‌ను విదేశాల్లో ఎందుకు ఉంచార‌ని వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన స‌భ్యులు ఈ-పేమెంట్ కంపెనీని ప్ర‌శ్నించారు. పేటీఎం స‌ర్వ‌ర్‌ను ఇండియ‌లో ఇన్‌స్టాల్ చేయాల‌ని, ఆ సంస్థ‌లో చైనా ఎంత పెట్టుబ‌డి పెట్టిందో తెలియాల‌ని పాన్య‌ల్ స‌భ్యులు పేమెంట్ కంపెనీని అడిగారు. ఇప్ప‌టికే పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ ముందు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, అమెజాన్ సంస్థ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.  ఇక టెలికాం ఆప‌రేట‌ర్లు రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్‌, ఓలా, ఊబ‌ర్‌లు కూడా ప్యాన‌ల్ ముందు హాజ‌రుకానున్నాయి. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి నేతృత్వంలోని క‌మిటీ.. ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్లును ప‌రిశీలిస్తున్న విష‌యం తెలిసిందే.