మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 20, 2020 , 03:34:36

23నే ముగిద్దాం సమావేశాలు కుదింపు

23నే ముగిద్దాం సమావేశాలు కుదింపు

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు కంటే వారం ముందే ముగియనున్నాయి. కరోనా బారినపడుతున్న ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సభ్యుల భద్రత దృష్ట్యా బుధవారమే సమావేశాలను ముగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం జరిగిన బీఏసీ సమావేశంలో అన్ని పక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సమావేశం జరిగే చివరి తేదీని సభాపతులు ప్రకటించనున్నారు.కాగా సమావేశాలు ముగిసేలోపు 11 ఆర్డినెన్స్‌లకు సం బంధించిన బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది.


logo