శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 13, 2020 , 11:01:51

రేప‌టి నుంచి పార్ల‌మెంటు.. కాసేప‌ట్లో బీఏసీ స‌మావేశం

రేప‌టి నుంచి పార్ల‌మెంటు.. కాసేప‌ట్లో బీఏసీ స‌మావేశం

న్యూఢిల్లీ: రేప‌టి నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. క‌రోనా స‌మ‌యంలో తొలిసారిగా పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంతో అధికారులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా సంద‌ర్శ‌కులు, మీడియా, స‌భ్యుల వ్య‌క్తిగ‌త సిబ్బందిపై ఆంక్ష‌లు విధించారు. ముందు జాగ్ర‌త్త‌గా స‌భ్యుల‌కు ఇప్ప‌టికే క‌రోనా కిట్లు అంద‌జేశారు. క‌రోనా ప‌రీక్ష‌లో నెగిటివ్ వ‌చ్చిన‌వారికే పార్ల‌మెంటులోకి అనుమ‌తించ‌నున్నారు. కాగా, పార్ల‌మెంటు చ‌రిత్ర‌లో తొలిసారిగా ప‌లు ప్ర‌దేశాల నుంచి రియ‌ల్ టైమ్‌లో ఉభ‌య‌స‌భ‌లు స‌మావేశ‌మ‌వుతున్నాయి.   

పార్ల‌మెంట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై రాజ్య‌స‌భ చైన‌ర్మ‌న్‌, లోక్‌స‌భ స్పీక‌‌ర్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ట్ర‌య‌ల్‌ర‌న్ నిర్వ‌హించారు. స‌మావేశాల తొలిరోజు ఉద‌యం లోక్‌స‌భ‌, మ‌ధ్యాహ్నం రాజ్య‌స‌భ జ‌ర‌గ‌నుంది. ఈనెల 15 నుంచి ఉద‌యం 11 గంట‌ల నుంచి రాజ్య‌స‌భ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 2 నుంచి లోక్‌స‌భ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. 

రాజ్య‌స‌భ స‌భ్యుల్లో అధిక వ‌య‌స్సువారే ఉండ‌టంతో అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 72 గంట‌ల ముందుగానే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని స‌భ్యుల‌కు సూచించారు. స‌భ్యుల‌తోపాటు వ్య‌క్తిగ‌త సిబ్బంది, ఇంటిలో ప‌నివారికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించాల‌ని స్ప‌ష్టంచేశారు.  

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఆంక్ష‌లు

క‌రోనా నేప‌థ్యంలో పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశాల‌పై ఆంక్ష‌లు విధించారు. ఎంపీల పీఏలు, పీఎస్‌ల‌కు ప్ర‌వేశాన్ని నిషేధించిన అధికారులు. అదేవిధంగా సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి లేద‌ని ప్ర‌క‌టించారు. మంత్రుల వ్య‌క్తిగ‌త సిబ్బందికి కూడా నామ‌మాత్రంగానే అనుమ‌తించ‌నున్నారు. స‌భా కార్య‌క‌లాపాల్లో భాగ‌మైన అధికారులు మిన‌హా ఎవ‌రికీ అనుమ‌తిలేద‌ని వెల్ల‌డించారు. ఎంపిక‌చేసిన మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు మాత్ర‌మే క‌వ‌రేజీకి అనుమతి. అత్య‌వ‌స‌ర వైద్య‌సిబ్బంది, అంబులెన్స్‌, అన్ని ర‌కాల వ్య‌వ‌స్థ‌ల‌ను సిద్ధంచేశారు. 

11 గంట‌ల‌కు బీఏసీ స‌మావేశం

పార్ల‌మెంటులో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యంపై అధికారులు నేడు ఉభ‌య స‌భ‌ల బీఏసీ స‌మావేశాలు ఏర్పాటుచేశారు. ఉద‌యం 11 గంట‌ల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ నేతృత్వంలో బీఏసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి టీఆర్ెస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుతోపాటు అన్నిపార్టీల లోక్‌స‌భాప‌క్ష నేత‌లు హాజ‌రుకానున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు రాజ్య‌స‌భ బీఏసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు నేతృత్వంలో స‌మావేశం. బిల్లులు, వివిధ అంశాల‌పై చ‌ర్చ‌ల‌కు స‌మ‌యం కేటాయించే అంశంపై చ‌ర్చించ‌నున్నారు. 


logo