శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 19:10:12

సమావేశాల ఉత్పాదకత 167 శాతం.. ఇది చరిత్రాత్మకం: ఓం బిర్లా

సమావేశాల ఉత్పాదకత 167 శాతం.. ఇది చరిత్రాత్మకం: ఓం బిర్లా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల ఉత్పాదకత 167 శాతంగా ఉన్నదని, ఇది చరిత్రాత్మకమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం సహకారంతో పార్లమెంట్‌ సమావేశాలు సమర్థవంతంగా జరిగాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్య వర్షాకాల సమావేశాలను నిర్వహించడంతో సవాలుతో కూడుకున్నదని ఓం బిర్లా అన్నారు. అయితే భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలమైందని, ప్రజలకు దానిపై నమ్మకం ఉందని తెలిపారు. పార్లమెంట్ కొత్త భవనం 21 నెలల్లో పూర్తి కావచ్చని ఓం బిర్లా చెప్పారు. అదే జరిగితే మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు పార్లమెంట్‌ సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి