- ఒడిశాలో కరోనాతో కొడుకు మరణం
- తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య
న్యూఢిల్లీ/బేగంపేట: ఒక్కగానొక్క కొడుకు.అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇంతలోనే ఆ యువకుడిని కరోనా బలితీసుకున్నది. కుమారుడి మరణం తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా కుటుంబాలకు కుటుంబాలనే బలితీసుకుంటున్నదనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. రాజ్‌కిశోర్, సులోచన దంపతుల ఒకే ఒక్క కుమారుడికి(27) ఇటీవల కరోనా సోకింది. బుధవారం అతనికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. దీంతో మనోవేదన చెందిన తల్లిదండ్రులు కుమారుడు చనిపోయిన కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.ఒడిశాలోనే జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన నిర్లిప్త భోలా, సుభద్ర స్వైన్‌లకు ఏడాదిన్నర కిందనే పెండ్లి అయింది. బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చారు. జూన్ 30న స్వస్థలానికి వెళ్లారు. ఈ నెల 1న భోలాకు జ్వరం రావడంతో క్వారంటైన్ నుంచి ఐసొలేషన్‌కు తరలించారు. అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక సుభద్ర ఐసొలేషన్ కేంద్రంలోనే చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అయితే కరోనా పరీక్ష ఫలితాల్లో ఇద్దరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. కాగా, పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన పల్ట్‌పాన్(34)కరోనా సోకిందేమోనన్న భయంతో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
- ౩ నెలలుగా ముంబైలోనే పూరీ
- హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 బైక్ లాంచ్
- చైనా మరో ఎత్తుగడ.. భారత కంపెనీల్లో వాటాల హస్తగతానికి కుట్ర
- అరుణాచల్‌లో రెండో కరోనా మరణం
- వందల డ్రోన్లతో ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు : వీడియో వైరల్
- రష్యాలో 24గంటల్లో 6,368 కరోనా కేసులు
- భూ అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పు!
- ట్రాన్స్ జెండర్ కు కరోనా.. ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్లు
- బెంగళూర్‌లో పోలీసులపై కరోనా పంజా
- రజినీకాంత్ ఆంథెమ్ ను హిట్ చేసినందుకు ధన్యవాదాలు
ట్రెండింగ్
- కరోనా భయం.. భార్యను ఇంటికి రానివ్వని భర్త
- స్నేహితులతో జాన్వీకపూర్..త్రోబ్యాక్ ఫొటో
- పూల్ లో సరదాగా కైరా అద్వానీ..ఫొటో వైరల్
- ముగ్గురిలో ఎవరంటే ఇష్టం..లులియా ఏం చెప్పిందంటే..?
- సుశాంత్-సంజనా 'దిల్ బెచారా' ట్రైలర్
- బాబ్-కట్ సెంగమలం.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ అదుర్స్
- వెరైటీ స్టిల్స్ లో.. కవ్విస్తున్న కాజల్
- నేను సీరియళ్లలో నటించట్లేదు: బ్రహ్మానందం
- సుశాంత్ కేసు..పోలీసుల ఎదుట హాజరైన బన్సాలీ
- 81 ఏండ్ల వయస్సులో ఉషాసోమన్ వర్కవుట్స్..వీడియో