శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 15:10:17

కేంద్ర బ‌ల‌గాల క్యాంటిన్ల‌లో.. జూన్ నుంచి స్వదేశీ వ‌స్తువుల అమ్మ‌కం

కేంద్ర బ‌ల‌గాల క్యాంటిన్ల‌లో..  జూన్ నుంచి స్వదేశీ వ‌స్తువుల అమ్మ‌కం

హైద‌రాబాద్‌: కేంద్ర బ‌ల‌గాల‌కు చెందిన క్యాంటీన్ల‌లో కేవ‌లం స్వదేశీ వ‌స్తువుల‌ను మాత్ర‌మే అమ్మ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాక మంత్రి అమిత్ షా తెలిపారు.  సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌.. క్యాంటీన్ల‌లో ఇక నుంచి కేవ‌లం మ‌న దేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను అమ్మ‌నున్నారు.  ఈ ఏడాది జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి ఈ నియ‌మాన్ని అమ‌లు చేయ‌నున్నారు.  ప‌ది ల‌క్ష‌ల ద‌ళాల‌కు చెందిన సుమారు 50 ల‌క్ష‌ల కుటుంబాలు ఇక స్వదేశీ వ‌స్తువులు కొంటార‌ని మంత్రి పేర్కొన్నారు.  దేశం స్వ‌యం స‌మృద్ధి కావాలంటే.. స్వ‌దేశీ బ్రాండ్ల‌ను ఎక్కువ‌గా వాడాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే.  

క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. అయితే మంగ‌ళ‌వారం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన మోదీ.. దేశ ప్ర‌జ‌లంద‌రూ స్వ‌దేశీ వ‌స్తువుల‌కు ఎక్కువ విలువ ఇవ్వాల‌న్నారు.  లోక‌ల్ బ్రాండ్లే.. జీవ‌న మంత్రం కావాల‌న్నారు.  ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇదే అభ్య‌ర్థ‌న చేశారు.  మ‌న దేశంలో త‌యారైన ప్రొడ‌క్ట్స్‌ను ఎక్కువ శాతం కొనుగోలు చేయాల‌న్నారు. సీఏపీఎఫ్ కింద ప‌నిచేసే సీఆర్‌ఫీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ, అస్సాం రైఫిళ్ల క్యాంటీన్ల‌లో ప్ర‌తి ఏడాది సుమారు 2800 కోట్ల వ‌స్తువుల అమ్మ‌కాలు జ‌రుగుతుంటాయి.  logo