సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 07:13:12

కార్లు కడిగి చదువుకొని 91.7 శాతం మార్కులు సాధించాడు!

కార్లు కడిగి చదువుకొని 91.7 శాతం మార్కులు సాధించాడు!

న్యూఢిల్లీ : పరమేశ్వర్‌ వయస్సు 17 ఏండ్లు. ఢిల్లీలోని మురికివాడల్లో అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన అతనికి చదువంటే ఎనలేని మక్కువ. కానీ రోజూ రెండుపూటలు తిండి దొరకడమే కష్టం. తండ్రికి గుండె జబ్బు.  ఇద్దరు సోదరులకు ఏ పని లేదు. అయినా పరమేశ్వర్‌ చదువుపై ఇష్టాన్ని వదులుకోలేదు. కుటుంబం మీద ఆధారపడటం కూడా అతడికి ఇష్టం లేదు. కార్లు కడిగే పనిలో కుదిరాడు. రోజూ ఉదయం 4 గంటలకు లేచి..అరగంట నడిచి తను పనిచేసే షెడ్డుకు చేరుకొనేవాడు.

అక్కడ రెండున్నర గంటలు పనిచేసి చదువుకోవడానికి వెళ్లేవాడు. ఇలా నెల.. రెండు నెలలు కాదు మూడేండ్లుగా కష్టపడ్డాడు. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 91.7 శాతం మార్కులు సాధించాడు. కార్లు కడిగినందుకు నెలకు రూ. 3 వేలు ఇచ్చేవారు. చలికాలంలో చేతులు గడ్డకట్టుకుపోతున్నా కూడా పనిమానేవాడు కాదు. తనకు టీచర్‌ కావాలని ఉందని చెప్పాడు. ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నా చదుకోవాలంటే బద్ధకం చూపే చాలా మందికి పరమేశ్వర్‌ జీవితం కనువిప్పు కలిగించవచ్చు కదా.


logo