మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 15:41:03

చైనా మొబైల్‌ కంపెనీ బోర్డుపై నల్లరంగు పూసి నిరసన

చైనా మొబైల్‌ కంపెనీ బోర్డుపై నల్లరంగు పూసి నిరసన

పాట్నా: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో జరిగిన భారత్‌, చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్ల వీరమరణంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాలో జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పు యాదవ్‌ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న చైనా మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ ఎదుట స్థానికులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం జేసీబీ ఎక్కిన ఆయన ఆ సంస్థ పేరుపై నల్లరంగు పూశారు. చైనా వస్తువులను వాడవద్దని, వాటిని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు చైనా వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో గురువారం లైవ్‌ స్ట్రీమ్‌లో భారత్‌లో ప్రారంభించాల్సిన ప్రతిష్ఠాత్మక 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణను ఒప్పొ రద్దు చేసుకున్నది. logo