మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 01:33:26

పేపర్‌ టీ కప్పులు ప్రమాదకరం

పేపర్‌ టీ కప్పులు ప్రమాదకరం

ఖరగ్‌పూర్‌: పని చేసిచేసి బుర్ర వేడెక్కింది ఓ చాయ్‌ తాగాలి.. స్నేహితుడు కలిశాడు మర్యాదకోసం ఓ చాయ్‌ తాగాలి.. నేటి కాలంలో చాలామందికి చాయ్‌ లేకుండా పూట గడువదు. ఇంట్లో తప్పితే బయట ఎక్కడ చాయ్‌ బండివద్దకెళ్లినా చాయ్‌ అడగ్గానే పేపర్‌ కప్పుల్లోనే అందిస్తున్నారు. కానీ ఈ పేపర్‌ కప్పులు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు. పేపర్‌ కప్పులను తయారుచేసేటప్పుడు గట్టిదనం కోసం వాటికి పాలీఇథైలిన్‌ ప్లాస్టిక్‌తో తయారైన హైడ్రోఫోబిక్‌ కోటింగ్‌ వేస్తారు. కప్పులో 85-90 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న చాయ్‌కానీ, మరేదైనా ద్రవపదార్థం కానీ పోసినప్పుడు అందులోకి మైక్రోఫోబిక్‌ సూక్ష్మ కణాలు విడుదలవుతాయి. కేవలం 15 నిమిషాల్లోనే వంద మిల్లీ లీటర్ల చాయ్‌లోకి దాదాపు 25వేల కణాలు చేరుతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుధా గోయెల్‌ తెలిపారు. ఈ మైక్రోఫోబిక్‌ కణాలు శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతాయని వెల్లడించారు. పేపర్‌ కప్పుల్లో వేడిగా ఉండే ద్రవపదార్థాలను తాగవద్దని సూచించారు.