ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 19:05:10

పాజిటివ్‌ జంటతో ప్రయాణం.. తెలిసి జనం పరుగో పరుగు..

పాజిటివ్‌ జంటతో ప్రయాణం.. తెలిసి జనం పరుగో పరుగు..

చెన్నై : కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కావు.. మహమ్మారి ఎవరికి ఎక్కడ ఎలా సోకుతుందో తెలియదు.. ఎవరైనా ఎక్కడైనా దగ్గినా.. తుమ్మినా జనం జంకుతూ వారికి దూరంగా వెళ్తున్నారు. అదే పాజిటివ్‌ అని తేలిన వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నామని తెలిస్తే.. ఇంకా ఏమైనా ఉందా అంతా పరుగో పరుగు.. 

తమిళనాడు రాష్ట్రంలో ఓ జంట మంగళవారం నైవేలి పట్టణానికి వెళ్లేందుకు కడలూరు జిల్లాలో రాష్ట్ర రవాణా సంస్థ (టీఎన్‌ఎస్‌టీసీ) బస్సు ఎక్కారు. అంతకు ముందు రోజు సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రక్త నమూనాలను ఇచ్చారు. హోంక్వారంటైన్‌లో ఉండకుండా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నైవేలికి వెళ్లేందుకు కడలూరులో బస్సు ఎక్కి వెళ్తుండగా.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరోనా వైరస్‌ ఫలితాల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో పక్కనే ఉన్న ప్రయాణికులు వారి మాటలను విని ఆందోళనకు గురై, బస్సును అర్ధాంతరంగా ఆపి పరుగులు పెట్టారు. అనంతరం సమాచారం అధికారులు జంటను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు.  ఆ తర్వాత బస్సు మొత్తాన్ని జిల్లా యంత్రాంగం రసాయనాలతో శానిటైజ్‌ చేయించారు.  


logo