బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 16:15:43

ఆర్టీసీ బ‌స్సులో క‌రోనా సోకిన దంప‌తులు ప్ర‌యాణం

ఆర్టీసీ బ‌స్సులో క‌రోనా సోకిన దంప‌తులు ప్ర‌యాణం

చెన్నై : ఏ పుట్ట‌లో ఏ పాము ఉందో అన్న‌ట్టు.. ఎవ‌రికి క‌రోనా వైర‌స్ సోకిందో.. ఎవ‌రికి సోక‌లేదో అనే అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. క‌రోనా సోకిన ఇద్ద‌రు దంప‌తులు ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి.. మిగ‌తా ప్ర‌యాణికుల గుండెల్లో ద‌డ పుట్టించారు. 

త‌మిళ‌నాడుకు చెందిన ఇద్ద‌రు దంప‌తులు.. ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం కంటే ముందు రోజు క‌రోనా ప‌రీక్ష‌ల నిమిత్తం త‌మ ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చారు. ఆ ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అయితే ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చిన మ‌రుస‌టి రోజు దంప‌తులిద్ద‌రూ.. క‌డ‌లూరు జిల్లా నుంచి త‌మిళ‌నాడులోని నెయెవెల్లికి ఆర్టీసీ బ‌స్సులో బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్య‌లోనే వారికి వైద్యాధికారుల నుంచి ఫోన్ వ‌చ్చింది. మీకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు చెప్పారు. 

దీంతో బ‌స్సులో ఉన్న మిగ‌తా ప్ర‌యాణికులంద‌రూ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. బ‌స్సు దిగి పారిపోయారు. ఇక క‌రోనా సోకిన దంప‌తుల‌ను మాత్రం.. అంబులెన్స్ లో కొవిడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత బ‌స్సును శానిటైజ్ చేశారు. 


logo