గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 01:08:01

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకుంటే లాసే!

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకుంటే లాసే!

న్యూఢిల్లీ: ఆధార్‌ నంబర్‌ను పాన్‌ కార్డుతో వచ్చేనెల 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పాన్‌ కార్డు- ఆధార్‌ అనుసంధాన గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. తాజాగా వచ్చేనెల 31 వరకు పొడిగించింది. గత నెల 27వ తేదీ వరకు పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించిన వారు 30.75 కోట్ల మందికి పైగా ఉంటారు. అయినా, మరో 17.58 కోట్ల మంది ఆధార్‌, పాన్‌ కార్డును అనుసంధానించలేదని ఐటీ శాఖ తెలిపింది. మార్చి 31 లోపు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించిన పాన్‌ కార్డులు మాత్రమే పని చేస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. 


logo
>>>>>>