గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 14:38:28

మోదీకి రాఖీ పంపిన పాక్ సోద‌రి‌..

మోదీకి రాఖీ పంపిన పాక్ సోద‌రి‌..

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి.. పాకిస్థాన్‌కు చెందిన ఖామ‌ర్ మోషిన్ షేక్ రాఖీ పంపారు.  ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో ఉంటున్న మోషిన్ ఈసారి నేరుగా రాఖీని క‌ట్ట‌లేక‌పోతున్న‌ట్లు తెలిపారు.  ప్ర‌ధాని మోదీకి రాఖీని పోస్టు చేశాన‌ని, అది ఆయ‌న‌కు చేరిన‌ట్లు కూడా ఆమె పేర్కొన్నారు.  క‌రాచీకి చెందిన మోషిన్ షేక్ 35 ఏళ్ల క్రితం ఢిల్లీకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె అహ్మ‌దాబాద్ వ్య‌క్తిని  పెళ్లాడింది. ఓ సంద‌ర్భంలో మోదీని మోషిన్ క‌లిశారు. అప్ప‌టి నుంచి మోషిన్‌ను సోద‌రిగా మోదీ పిలిచేవారు. ఆ క్ష‌ణం నుంచి మోదీకి మోషిన్ రాఖీ క‌డుతూ వ‌స్తున్నారు. ఈ సారి క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మోదీ వ‌ద్ద‌కు వెళ్లి రాఖీ క‌ట్ట‌లేక‌పోతున్న‌ట్లు ఆమె తెలిపారు. రానున్నఅయిదేళ్ల మోదీ పాల‌న మంచిగా కొన‌సాగాల‌ని ఆమె ఆకాంక్షించారు.  
logo