ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు కలకలం రేపాయి. ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు ఓ ఫిర్యాదు అందింది. ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్ దగ్గర ఎవరో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తి వెల్లడించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. ఈ నినాదాలు చేసిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా యులు బైక్స్ తీసుకొని అక్కడ చక్కర్లు కొడుతున్నారు.
వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించగా.. తాము సైట్ సీయింగ్ కోసం ఇండియాకు వచ్చామని చెప్పారు. యులు బైక్స్‌పై రేసింగ్ చేస్తున్నామని, ఈ సందర్భంగా ఒకరినొకరం తమ దేశాల పేర్లు పెట్టుకొని పిలుచుకున్నామని తెలిపారు. అందులో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి కూడా ఉండటంతో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసినట్లు వెల్లడించారు. వాళ్లను విచారించిన తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఆ టూరిస్టులు మామూలుగానే ఆ నినాదాలు చేశారని పోలీసులు కూడా స్పష్టం చేశారు.
తాజావార్తలు
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
- డ్రాగన్‌తో వాణిజ్యం కొనసాగించాల్సిందే: రాజీవ్ బజాజ్ కుండబద్ధలు
- పదవీ విరమణ పొందిన అధికారులకు సీఎస్ సన్మానం
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్‌నాథ్ సింగ్