బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 19:55:01

సరిహద్దులో పాక్‌ ఆర్మీ కాల్పులు

సరిహద్దులో పాక్‌ ఆర్మీ కాల్పులు

పూంచ్‌ : అంతర్జాతీయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నా పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దులో తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత పౌరులే లక్ష్యంగా నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుపుతూనే ఉంది. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ని, కృష్ణ ఘాటి, మన్‌కోట్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంట సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పాక్‌ సైనికులు మోర్టార్లతో షెల్లింగ్స్‌తో, ఆయుధాలతో కాల్పుల జరిపారు. భారత సైన్యం ధీటుగా స్పందించడంతో తోక ముడిచారు. శుక్రవారం కుప్వారాలోని తంగ్ధర్ సెక్టార్‌లో పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండడంతో సరిహద్దు వెంట భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి.
logo