గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 17:04:51

మచ్‌హల్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. భారత సైనికుడికి గాయాలు

మచ్‌హల్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. భారత సైనికుడికి గాయాలు

జమ్మూ కశ్మీర్‌ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. ఇటీవల వరుసగా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సోమవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచ్‌హల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట సోమవారం పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో భారత సైన్యానికి చెందిన జవాన్‌ ఒకరు గాయపడ్డాడని ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. అయితే సైనికుడికి ఏం ప్రమాదం లేదని, ఆరోగ్యంగా నిలకడగా ఉందని తెలిపింది. ‘కుప్వారాలోని మచ్‌హల్‌ సెక్టార్‌లో ఎల్‌ఓసీ వెంట పాక్‌ ఈ ఉదయం మోర్టార్లు, ఇతర ఆయుధాలతో కాల్పుల జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి సరైన సమాధానం ఇస్తున్నామని, గాయపడిన పరిస్థితి నిలకడగా ఉందని’ భారత సైన్యానికి చెందిన చినార్‌ కార్ప్స్‌ ఓ ట్వీట్‌లో తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo