ఆదివారం 29 మార్చి 2020
National - Mar 26, 2020 , 14:54:08

హీరా, దేగ్వార్‌ సెక్టార్‌ వెంబడి పాక్‌ కాల్పులు

హీరా, దేగ్వార్‌ సెక్టార్‌ వెంబడి పాక్‌ కాల్పులు

శ్రీనగర్‌ : పాకిస్థాన్‌ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కతువా జిల్లాలోని హీరానగర్‌ సెక్టార్‌, పూంచ్‌ జిల్లాలోని దేగ్వార్‌ సెక్టార్‌ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ కాల్పులు గురువారం ఉదయం వరకు కొనసాగినట్లుగా అధికారులు వెల్లడించారు. హీరానగర్‌ సెక్టార్‌లోని పన్సార్‌, మాన్యరి, చెక్‌ చంగా ప్రాంతాల్లో పాకిస్థాన్‌ రేంజర్లు మోర్టార్‌ దాడులకు పాల్పడ్డారు. బీఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి పాక్‌ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఎటువంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.


logo